తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం

తెలంగాణ భవన్ మహిళా దినోత్సవంలో కలకలం

హైదరాబాద్:  తెలంగాణ భవన్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకురాలు అరుణ మాట్లాడుతూ.. ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్నామని తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2001నుంచి పార్టీలో ఉన్న తనను.. సీఎంతో కలువనిస్తలేరని.. గోడు వెళ్లబోసుకున్నారు. పదవులు వచ్చిన వాళ్లు సంతోషంగా మాట్లాడుతున్నారని, ఉద్యమంలో పడిన తమ ఇబ్బందులు ఎవరికి తెలుసన్నారు.  అరుణ మాట్లాడుతుండగా స్టేజ్ మీదున్న పార్టీ మహిళా లీడర్లు మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు. ఏళ్లుగా పార్టీలో ఉన్నవారిని కాదని.. కొత్తవారిని పార్టీలో చేర్చుకొని పదవులు ఇస్తున్నారని మండిపడ్డారు అరుణ. చివరకు అరుణ చేతిలో మైక్ లాక్కుని ఆమెను మహిళా నేతలు బలవంతంగా కూర్చోపెట్టారు.