
హైదరాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్‌కు 429 ఎంపీపీ పదవులు దక్కాయి. కాంగ్రెస్ 62, బీజేపీ 6, ఇండిపెండెంట్లు 12, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2, సీపీఎం, టీడీపీలకు చెరో ఎంపీపీలను దక్కించుకున్నాయి. శుక్ర, శనివారం కలిపి మొత్తం 513 ఎంపీపీ అధ్యక్షులను ఎన్నుకున్నారు. కోరం లేకపోవడం, ఇతర కారణాలతో శుక్రవారం వాయిదా పడిన కొన్ని ఎంపీపీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండ్రోజుల్లో ఏ పార్టీ ఎన్ని ఎంపీపీలు గెల్చుకుందన్న వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఎన్నికలు జరగకుండా మిగిలిపోయిన 22 అధ్యక్ష, 26 ఉపాధ్యక్ష, 18 కో–ఆప్టెడ్ సభ్యులను ఎన్నుకునేందుకు తేదీని నిర్ణయిస్తూ ఎన్నికల సంఘం విడిగా నోటిఫికేషన్ విడుదల చేయనుంది.