
నెక్కొండ, వెలుగు: మహిళ మెడపై కత్తిపెట్టి దుండగులు నగలు ఎత్తుకెళ్లిన ఘటన వరంగల్జిల్లాలో జరిగింది. ఎస్ఐ మహేం దర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండ మండలం పనికర గ్రామానికి చెందిన బండారి నిరోషా కిరాణం షాపు నిర్వహిస్తుంది. శుక్రవారం షాపు వద్దకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి బైక్పై వచ్చారు. షాపు లోపలికి వెళ్లి ఆమె మెడపై కత్తిపెట్టి బీరువా ఓపెన్చేయించి 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, సీఐ శ్రీనివాస్ సందర్శించారు. బాధితురాలు నిరోషా ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.