
కరీంనగర్ : పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో పర్యటిస్తున్నారు. కేటీఆర్ కు స్వాగతం చెబుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కర్లు భారీ స్వాగత ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో భారీ స్థాయిలో పటాకులు పేల్చారు. ఈ సందర్భంగా చిన్నపాటి ప్రమాదం జరిగింది. పటాకులు పేలి పార్టీ వర్కర్లపై పడ్డాయి. దీంతో.. వారు ధరించిన దుస్తులు స్వల్పంగా గాలి.. శరీరానికి గాయాలయ్యాయి. పటాకులు మీద పడటంతో.. కొద్దిసేపు అలజడి రేగింది.