కాంగ్రెస్ పార్టీ హామీలిస్తే.. నెరవేర్చేది ఎవరు?

కాంగ్రెస్ పార్టీ హామీలిస్తే.. నెరవేర్చేది ఎవరు?

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ రెబల్స్ కు బీజేపీ, కాంగ్రెస్ లు మద్దతు ఇస్తున్నాయన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు ఇస్తే వాటిని ఎవరు నెరవేర్చాలని అడిగారు,( ఏ పార్టీ హామీలిచ్చినా..  వాటి అమలుకు మళ్లీ టీఆర్ఎస్  నాయకుల దగ్గరకే వెళ్లాలి)  కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మరో మారు బుద్ధి చెప్తారన్నారు. ఎన్నికలు అన్నాక టికెట్స్ రాని వాళ్లు చాలా ఆరోపణలు చేస్తారని అవన్నీ సాధారణమే అని చెప్పారు. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదన్నారు. కొల్లాపూర్ లో మూడు రోజుల్లో రెబల్స్ దారికి వస్తారన్నారు. 90 శాతం రెబల్స్ సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. అధికార పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క మంచి పని కూడా చెయ్యలేదన్నారు కేటీఆర్. 18వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2లక్షల ఇల్లు నిర్మిస్తున్నామని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వస్తే తీసుకెళ్లి చూపిస్తానన్నారు. బీజేపీ పాలిత మెట్రో సిటీలో ఎక్కడ అయిన లక్ష ఇల్లు కట్టారా చూపించాలని అన్నారు. తమకు ఇంకా నాలుగు ఏళ్ళు అధికారముందని,ఈ ఆర్థిక సంవత్సరం లో చెయ్యని పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం లో చేస్తామని చెప్పారు.

మున్సిపల్ మంత్రి గా కొత్త మున్సిపల్ చట్టాన్ని కఠినంగా అమలు చెయ్యడమే తన ముందున్న సవాల్ అని చెప్పారు కేటీఆర్. తాను కాబోయే సీఎం అన్నది వాస్తవం కాదని…అవన్ని ఊహగానాలేనని అన్నారు.

More News కోర్టుకు హాజరు కాలేనన్న జగన్…

‘కేటీఆర్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు’
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు