ఎదురెదురుగా ఢీకొన్న కారు, ట్రక్కు.. 8 మంది మృతి

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ట్రక్కు.. 8 మంది మృతి
  • తమిళనాడులో ఘటన
  • రాంచీలో కారు నదిలో పడి ఐదుగురు..

చెన్నై/ రాంచి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు ట్రక్కు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. స్పాట్​లో ఏడుగురు చనిపోగా తీవ్రగాయాలైన మహిళను ఆస్పత్రికి తరలించారు. అక్కడ ట్రీట్​మెంట్ పొందుతూ ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు. తిరువణ్నామలై నుంచి బెంగళూరు వెళ్తుండగా చెంగం టౌన్ వద్ద ఆదివారం ఈ ప్రమాదం జరిగింది.

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం

జార్ఖండ్​లో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సిక్తియా బ్యారేజీ వంతెన మీది నుంచి కారు నీళ్లలో పడిపోవడంతో ఐదుగురు స్పాట్​లోనే ప్రాణాలు కోల్పోయారు. గాయాలతో డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. మంగళవారం డియోఘర్‌‌లోని అసన్‌‌సోల్ నుంచి సంకుల్ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులంతా కలిసి మంగళవారం డియోఘర్‌‌లోని అసన్‌‌సోల్ నుంచి సంకుల్ గ్రామానికి కారులో బయల్దేరారు. బ్యారేజీ వద్దకు చేరుకోగానే డ్రైవర్​ సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతో వెహికల్ కంట్రోల్ తప్పి నీళ్లలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు చనిపోయారు. డ్రైవర్ ప్రాణాలతో బయపటపడ్డాడు. కారు నడిపేందుకు డ్రైవర్ ఉన్నప్పటికీ సెల్ఫీ తీసుకునేందుకే కుటుంబ సభ్యుల్లో ఒకరు కారు నడపడం స్టార్ట్ చేశారని డ్రైవర్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సెల్ఫీ తీసుకోవడంతోనే కారు కంట్రోల్ తప్పి నీళ్లలో పడిపోయిందన్నారు.