సొంత రాష్ట్రాల్లో వెనుకబడ్డ  అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బైడెన్

సొంత రాష్ట్రాల్లో వెనుకబడ్డ  అధ్యక్ష అభ్యర్థులు ట్రంప్‌, బైడెన్

అమెరికా అధ్యక్ష పదవిని అధిరోహించేది ఎవరో తేల్చే కీలక ఘట్టం కౌటింగ్‌ ప్రక్రియ హోరాహోరీగా సాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం..ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్ ముందజలో ఉన్నారు. బైడెన్ 238 ఎలక్టోరల్‌ ఓట్లను పొందగా, డొనాల్డ్‌ 213 ఓట్లతో కొంత వెనుకబడ్డారు. అయితే వారి సొంత రాష్ట్రాల్లో ఈ ఇద్దరు వెనుకబడటం ఆశ్చర్యపరుస్తోంది. ట్రంప్‌ సొంత రాష్ట్రమైన న్యూయార్క్‌లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. 29 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో బైడెన్ కు 37.89 లక్షల ఓట్లు పోలవ్వగా..ట్రంప్‌కు కేవలం 29.56 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. బైడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 20 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ట్రంప్‌కు 29.65 లక్షల ఓట్లు పడగా, బైడెన్ కు 22.90 లక్షల ఓట్లు లభించాయి.