ట్రంప్ మగ్ షాట్ టీ షర్ట్స్ కి మస్త్ గిరాకీ.. రెండ్రోజుల్లో రూ.58 కోట్ల విరాళం

ట్రంప్ మగ్ షాట్ టీ షర్ట్స్ కి మస్త్ గిరాకీ.. రెండ్రోజుల్లో రూ.58 కోట్ల విరాళం

అగ్రరాజ్యం అమెరికా 2020  ప్రెసిడెంట్ ఎన్నికల ఫలితాలు మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగాలపై ఆగస్టు 24న జార్జియాలో అరెస్టై, 20 నిమిషాల పాటు జైలుకెళ్లి విడుదలైన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి సానుభూతితో కూడిన ఫండ్స్ వెల్లువెత్తుతున్నాయి.  

ఆయన మగ్ షాట్ తో ఉన్న టీ షర్ట్ లు, బీర్ కూజీలు, పోస్టర్లు, బంపర్ స్టిక్కర్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.  రెండు రోజుల్లో తమకు 71 లక్షల డాలర్లు (రూ.58 కోట్లు) విరాళంగా అందినట్లు ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ టీం తెలిపింది. 

ఒక వ్యక్తి అరెస్టయ్యాక నిందితులను ఫొటో తీస్తారు. దాన్ని మగ్ షాట్ అని పిలుస్తారు. ట్రంప్ ని కూడా అలాగే ఫొటో తీసి టీ షర్టులు తదితర వస్తువులపై అంటించారు. అవి కాస్తా హాట్ కేకుల్లా అమ్ముడు పోవడంతో ట్రంప్ సానుభూతిపరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ట్రంప్ మళ్లీ దేశాధ్యక్షుడు అవుతారని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.