ఖబడ్దార్‌ ఇరాన్.. బాగ్దాద్ ​ఎంబసీ దాడిపై ట్రంప్

ఖబడ్దార్‌ ఇరాన్.. బాగ్దాద్ ​ఎంబసీ దాడిపై ట్రంప్
  • బాగ్దాద్ ​ఎంబసీపై దాడిని సీరియస్‌గా తీసుకున్న ట్రంప్

బాగ్దాద్: ఇరాన్​లోని తమ పౌరులకు గానీ, ఆస్తులకు గానీ ఏం జరిగినా టెహరాన్​ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ట్రంప్​ చెప్పారు. ఇది వార్నింగ్​ కాదు.. థ్రెట్ అని ట్రంప్​ ట్వీట్​ చేశారు. న్యూ ఇయర్​ విషెస్‌ చెబుతూ చేసిన ట్వీట్​లో ఆయన ఈ విషయాన్నీ ప్రస్తావించారు. మిడిల్​ ఈస్ట్​ రీజియన్​కు మరిన్ని బలగాలను పంపుతున్నట్లు డిఫెన్స్​ సెక్రెటరీ మార్క్​ ఈస్పర్​ ప్రకటించిన తర్వాత ట్రంప్​ ఈ ట్వీట్​ చేశారు. పారామిలిటరీ గ్రూప్​ లీడర్​అబు మహది అల్​ ముహందిస్​మరో పదిమంది అనుచరులు, వందలాదిగా ప్రజలతో కలిసి ఎంబసీపై దాడి చేశారని ట్రంప్​ ఆరోపించారు. హైసెక్యూరిటీ ఉండే చోట ఇలాంటి దాడి జరిగే అవకాశమే లేదని, ఇరాన్​ దీనికి బాధ్యత వహించాల్సిందేనని అన్నారు. మరోవైపు, మిడిల్​ ఈస్ట్​కు మరో 750 మంది ర్యాపిడ్​ రెస్పాన్స్​ యూనిట్​బలగాలను పంపిస్తున్నట్లు ఈస్పర్​మీడియాకు వెల్లడించారు. బాగ్దాద్​ ఎంబసీపై దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన వివరించారు.

అసలేం జరిగింది?

కాటెబ్​ హెజ్బొల్లా పారామిలిటరీ గ్రూపును టార్గెట్​ చేసి ఇరాన్, ఇరాక్​లలోని పలుప్రాంతాల్లో అమెరికా మిస్సైల్​ అటాక్​ చేసింది. ఆదివారం జరిగిన ఈ దాడిలో సుమారు 25 మంది చనిపోయారు. దీనిపై ఇరాన్, ఇరాక్​లలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. బాగ్దాద్​లోని అమెరికా ఎంబసీపై నిరసనకారులు దాడిచేసి, ఆఫీసును ధ్వంసం చేశారు. దీనిపై అమెరికా సీరియస్​గా స్పందించింది. వెంటనే తన బలగాలను అక్కడికి పంపించింది.

దాడి టెర్రరిస్టుల పనే..

ఎంబసీపై దాడి టెర్రరిస్టులు చేసిందేనని యూఎస్​ డిఫెన్స్‌ సెక్రటరీ మైక్​ పాంపియో ఆరోపించారు. అయితే, ఈ విషయంలో తప్పంతా అమెరికాదేనని ఇరాన్​ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అబ్బాస్​ మౌసావి ఆరోపించారు. ఇరాన్​ భూభాగంపై దాడులు జరిపి అమెరికా, తమ సావరిన్‌ పవర్‌కు భంగం కలిగించిందని విమర్శించారు. యూఎస్​ దాడిలో తమ పౌరులు కనీసం 25 మంది చనిపోయారని చెప్పారు. ఈ ఘటనతో వెల్లువెత్తిన ప్రజాగ్రహం అమెరికా ఎంబసీపైకి మళ్లిందని మౌసావి వివరించారు.