ఆ పరిణామాలను చైనా ఎదుర్కోవాల్సిందే

ఆ పరిణామాలను చైనా ఎదుర్కోవాల్సిందే
  • కరోనాపై తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆరోపణలపై ట్రంప్
  • రీఓపెన్ ప్లాన్ రెడీ అవుతోందని వెల్లడి

వాషింగ్టన్: కరోనాపై ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, డబ్ల్యూహెచ్ ఓకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్న ఆరోపణలపై చైనా పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. వైట్ హౌస్ లో మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం చెప్పారు. తమ దేశ ఎకానమీని రీఓపెన్ చేసే ప్లాన్ పూర్తి కావొస్తోందన్నారు. “మా టీమ్ తో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నాం. రీఓపెన్ ప్లాన్ పూర్తి కావొస్తోంది. త్వరలో కొత్త గైడ్ లైన్స్ ను ఫైనలైజ్ చేస్తాం. గవర్నర్లకు వాటిని అందజేసి జాగ్రత్తలు తీసుకుంటూనే రీఓపెన్ చేయాలని సూచిస్తాం. కొత్త గైడ్ లైన్స్ ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపుతాయి. దేశం రీఓపెన్ కావాలి. నార్మల్ లైఫ్ కు చేరుకోవాలి. ఇదే మా ఆశ. ఎప్పుడు రీఓపెన్ అవుతుందో త్వరలో ప్రకటిస్తాం’ అని ట్రంప్ అన్నారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియా సరిగ్గా కవర్ చేయడం లేదంటూ ట్రంప్ మండిపడ్డారు.

చైనాపై ఆధారపడొద్దు:ట్రంప్ కు సెనేటర్ స్టీవ్ డెనీస్ లెటర్

మెడికల్ సప్లయ్స్, ఎక్విప్ మెంట్ కోసం చైనాపై ఆధారపడకూడదని, ఇది దేశ భద్రతకు మంచిది కాదని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుందని సెనేటర్ స్టీవ్ డేనీస్ ట్రంప్ కు లెటర్ రాశారు. బయోమెడిసిన్, ఫార్మాస్యూటికల్, మెడికల్ ఇన్నోవేషన్ లో అమెరికా వరల్డ్ లీడర్ గా కొనసాగాలని ఆయన లెటర్ లో పేర్కొన్నారు. చైనాపై ఆధారపడొద్దని నలుగురు రిపబ్లికన్లు కూడా బిల్లు ప్రవేశపెట్టారు. కరోనా క్రైసిస్ ను చైనా కొన్ని వారాలపాటు దాచిపెట్టిందని, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందేందుకు కారణమైందని కాంగ్రెస్ వుమెన్ ఎలిస్ స్టెఫానిక్ ఆరోపించారు.