ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థను మోదీ చంపేశారు: రాహుల్ గాంధీ

ట్రంప్ చెప్పింది నిజమే.. మన ఆర్థిక వ్యవస్థను మోదీ చంపేశారు:  రాహుల్ గాంధీ

ఇండియన్ ఎకానమీ డెడ్ ఎకానమీ అని యూఎస్ ప్రసిడెంట్ ట్రంప్ చెప్పింది నిజమేనని అన్నారు రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థను చంపేశారని సంచలన కామెంట్స్ చేశారు రాహుల్. మోదీనే ఎకానమీని చంపేశారని అన్నారు. గురువారం (జులై 31) పార్లమెంట్ ఆవరణలో ట్రంప్ చేసిన కామెంట్స్ పై మాట్లాడుతూ రాహుల్ ఈ విధంగా స్పందించారు. 

భారత ఆర్థిక వ్యవస్థ నాశనం కావడానికి కారణాలను వెల్లడించారు రాహుల్. మోదీ హయాంలో సహచరుల కోసం తీసుకున్న నిర్ణయాలు.. అదే విధంగా ఎకానమిక్ పాలసీల కారణంగా ఆర్థిక వ్యవస్థ నాశనం అయ్యిందని మండిపడ్డారు. ఇండియన్ ఎకానమీ నాశనం కావడానికి ముఖ్యమైన 5 పాయింట్లను రాహుల్ రైజ్ చేశారు. అవి.

  • మోదీ-అదానీ ఫ్రెండ్షిప్
  • డీమానిటైజేషన్, జీఎస్టీ
  • ఇండియాలో తయారీ పేరున అసెంబుల్ చేయడం
  • సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు (MSME) లను నాశనం చేయడం
  • రైతులను అణచివేయడం

ట్రంప్ చేసిన వ్యాఖ్యలు:

ఇండియాపై 25 శాతం టారిఫ్స్ విధిస్తామని ప్రకటించిన ట్రంప్.. ఈ సందర్భంగా ఇండియన్ ఎకానమీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా రష్యాతో స్నేహం కోరుకుంటోందని.. కానీ రష్యా లాంగే ఇండియన్ ఎకానమీ కూడా డెడ్ ఎకానమీ అని అన్నారు.  ఈ రెండు దేశాలు పతనమైన ఆర్థిక వ్యవస్థలను కలిసి మరింత కిందికి తీసుకెళతాయని అయితే దానిని తాను అస్సలు పట్టించుకోనంటూ వ్యాఖ్యానించారు.