జీ7 సదస్సుపై ట్రంప్ కీలక కామెంట్

జీ7 సదస్సుపై ట్రంప్ కీలక కామెంట్

వాషింగ్టన్: జీ7 సదస్సు నిర్వహణపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక కామెంట్ చేశారు. ఈ ఏడాది మార్చిలో జరగాల్సి జీ 7 శిఖరాగ్ర సమావేశం కరోనా ఎఫెక్టుతో జూన్ కు వాయిదా పడింది. ప్రపంచం అంతటా వైరస్ విస్తరించిన నేపథ్యంలో చాలా దేశాలు సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జీ 7 సదస్సును నేరుగా నిర్వహిస్తామని ట్రంప్ కామెంట్ చేశారు. సభ్య దేశాల ప్రతినిధులు నేరుగా సమావేశానికి హాజరయ్యే విషయం పరిశీలిస్తున్నామని వైట్​హౌస్​ వద్ద మీడియాతో అన్నారు. సభ్యులందరి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడంతో కరోనా వైరస్ సాధారణ స్థాయికి వచ్చిందనే గొప్ప సంకేతం ప్రపంచానికి ఇవ్వవచ్చు అని అన్నారు. వచ్చేవారంలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. కిందటేడాది జరిగిన జీ7 సదస్సు ప్రాన్స్ లో జరగగా.. ఈ ఏడాది అమెరికాలో జరగనుంది.