నేను నం.1.. మోడీ నం.2

నేను నం.1.. మోడీ నం.2

ఫేస్​బుక్​ ర్యాంకింగ్స్ పై ట్రంప్
తొందర్లోనే ఇద్దరం కలవబోతున్నం
మన దేశంలో టూర్​పై మళ్లీ ట్వీట్
ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడి

వాషింగ్టన్/అహ్మదాబాద్‌/ముంబైప్రముఖ సోషల్​ మీడియా ఫేస్​బుక్​లో తాను, మోడీ నెంబర్​ 1, 2 ప్లేసుల్లో నిలవడం గొప్ప గౌరవమని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. మోడీ ఆహ్వానం మేరకు ఈ నెలాఖరులో ఇండియాలో పర్యటించనున్నానని, ఈ టూర్​ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ నెల 24, 25 తేదీలలో ట్రంప్ దంపతులు మన దేశంలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్​ శనివారం మరోసారి ట్వీట్​ ద్వారా వెల్లడించారు. ఫేస్​బుక్​ ర్యాంకింగ్స్ గురించి ట్రంప్​ గతంలోనూ ప్రస్తావించారు. దావోస్​ వేదికగా జరిగిన వరల్డ్​ ఎకనామిక్​ ఫోరం సదస్సులో సీఎన్​బీసీ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘ఫేస్ బుక్​లో నేను నెంబర్​ 1.. మరి నెంబర్​ 2 ఎవరో తెలుసా? ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ’ అని చెప్పారు.

ట్రంప్​ కాదు.. మోడీనే నెంబర్​1

అయితే, ట్విప్లొమసీ 2019 ర్యాంకింగ్స్ ప్రకారం.. ఫేస్​బుక్​లో 44 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో మోడీ నెంబర్​ 1 స్థానంలో ఉండగా.. సుమారు 26 మిలియన్ల ఫాలోవర్లతో ట్రంప్​ రెండో స్థానంలో నిలిచారు. పవర్​లేదన్న కారణాన్ని తప్పిస్తే అమెరికా మాజీ ప్రెసిడెంట్​ బరాక్​ ఒబామా ఫాలోవర్ల సంఖ్య వీళ్లిద్దరికన్నా ఎక్కువ.. సుమారు 55 మిలయన్ల మంది ఒబామాను ఫాలో అవుతున్నారు. నాన్ పొలిటికల్​గా చూస్తే.. ఫుట్​బాల్​ లెజెండ్స్ లియోనల్​ మెస్సీ(90 మిలియన్ ఫాలోవర్లు), క్రిస్టియానో రొనాల్డో(122.5 మిలియన్లు), పాప్​ స్టార్​ షకీరా(100 మిలియన్లు)

ట్రంప్​ టూర్​ కోసం 100 కోట్లకు పైగా ఖర్చు

ట్రంప్​ టూర్​ కోసం గుజరాత్​ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్​ ప్రకారం ట్రంప్ గుజరాత్​లో కేవలం 3 గంటల పాటే ఉంటారని చెబుతున్న అధికారులు.. ఆ 3 గంటల టూర్​ కోసం వంద కోట్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. ఇది కేవలం రఫ్​గా వేసిన అంచనా మాత్రమే. ట్రంప్​ దంపతులకు ఆతిథ్యమిచ్చే విషయంలో బడ్జెట్​గురించి ఆలోచించక్కర్లేదంటూ సీఎం విజయ్​ రూపానీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్ పర్యటించనున్న అహ్మదాబాద్​ సిటీ కొత్త అందాలను సంతరించుకుంటోంది. ఎయిర్​ పోర్ట్​ నుంచి మోతెరా స్టేడియంకు దారితీసే 17 రోడ్లు అందంగా ముస్తాబవుతున్నాయి. ఒకటిన్నర కిలోమీటర్లున్న ఈ రోడ్లను తీర్చిదిద్దేందుకు అహ్మదాబాద్​ అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ(ఏయూడీఏ) ఏకంగా రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం. ఈ టూర్​కు అయ్యే ఖర్చులో కొంత కేంద్రం కూడా భరిస్తుందని అధికార వర్గాలు  చెబుతున్నాయి. వీవీఐపీ రాక నేపథ్యంలో ఏర్పాట్లలో లోపం ఉండకుండా, నగరాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అడ్మినిస్ట్రేటివ్​ అనుమతుల కోసం ఆగాల్సిన అవసరంలేకుండా పనులు జరిపించేయాలని సూచించింది. రాష్ట్రంలోని వివిధ రోడ్లకు మరమ్మతులు చేసేందుకు, కొత్త రోడ్ల కోసం ప్రభుత్వం బడ్జెట్​లో రూ.500 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో నుంచే ప్రస్తుతం నిధులు విడుదల చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నిధులతో మోతెరా స్టేడియం, సబర్మతి ఆశ్రమం సహా పలు ఇతర రోడ్లను అందంగా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు.

యూఎస్ నిర్ణయంవల్ల మనకు నష్టం..శివసేన

ఇండియాను అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేర్చుతూ  యూఎస్ ట్రేడ్​ రిప్రజెంటేటివ్(యూఎస్ టీఆర్) తీసుకున్న నిర్ణయాన్ని శివసేన తప్పుబట్టింది. పార్టీ పత్రిక సామ్నాలో శనివారం నాటి ఎడిటోరియల్​లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తంచేసింది. దీనివల్ల మనదేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల లిస్ట్​ నుంచి తప్పించడం వల్ల వరల్డ్​ట్రేడ్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూటీవో) నుంచి అందే ప్రయోజనాలు దక్కవని తెలిపింది. యూఎస్ ప్రెసిడెంట్​ ట్రంప్​ మరో రెండు వారాల్లో మన దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని విమర్శించింది. ట్రంప్​ వస్తూ వస్తూ స్వీట్​బాక్స్ తెస్తారనుకుంటే.. చేదు మాత్రలు వెంటబెట్టుకుని వస్తున్నాడని ఆరోపించింది. ఈ చేదుమాత్రను మన ప్రధాని  తియ్యగా మార్చేస్తారా అని ఛాలెంజ్​ చేసింది. ఈ వారం మొదట్లో ఇండియా, చైనాలతో పాటు మొత్తం 24 దేశాలను యూఎస్ టీఆర్​ ఈ జాబితా నుంచి తప్పించింది. ఈ 24 దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే అభివృద్ధి చెందాయని చెబుతూ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాషింగ్టన్​ అందించే ప్రయోజనాలు ఈ దేశాలకు అవసరంలేదని అంటోంది.

అహ్మదాబాద్‌ టూర్​ కోసం దేనికెంత ఖర్చు?

రూ. 80 కోట్లు:  ట్రంప్​ వెళ్లే మార్గంలో కొత్తరోడ్లు వేయడానికి, రోడ్లు చదును చేయడానికి
రూ. 12–15 కోట్లు:  ప్రెసిడెంట్​ సెక్యూరిటీ
రూ. 7–10 కోట్లు:  మోతెరా స్టేడియం ఆరంభ కార్యక్రమంలో పాల్గొనే  1000 మంది గెస్టుల ట్రాన్స్​పోర్ట్​, రిఫ్రెష్‌మెంట్
రూ. 6 కోట్లు:  సిటీని  అందంగా తయారుచేయడానికి
రూ. 4 కోట్లు :  కల్చరల్​ కార్యక్రమాల కోసం