
న్యూయార్క్: ఐటీ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ నుంచి కంపెనీ గ్లోబల్ అఫైర్స్ప్రెసిడెంట్ లిసా మొనాకోను తొలగించాలని కంపెనీ సీఈవో సత్య నాదెళ్లకు అమెరికా ప్రెసిడెంట్డొ నాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. కంపెనీలో ఆమె ఉండటం దేశ భద్రతకు పెను ముప్పు అని తన సోషల్‌మీడియా ‘ట్రూత్’లో రాసుకొచ్చారు. ‘‘లిసా మొనాకో అవినీతిపరురాలు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆమె పాల్గొంటున్నారు.
అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన డీప్స్టేట్కుట్రల్లో లిసాకు కూడా భాగస్వామ్యం ఉంది. అలాంటి వ్యక్తి.. అమెరికా ప్రభుత్వంతో సంబంధాలున్న మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేయడం క్షమించరానిది. ఆమె దేశంలోని సున్నిత రహస్యాలను కూడా శత్రువులకు చేరవేసే అవకాశం ఉంటుంది. వెంటనే మైక్రోసాఫ్ట్ నుంచి బయటికి పంపించాలని డిమాండ్ చేస్తున్న” అని ట్రంప్ పేర్కొన్నారు.
గతంలో ఒబామా, జో బైడెన్అమెరికా అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారి వద్ద కీలక పదవులను లిసా మొనాకో నిర్వర్తించారు. ఒబామా హయాంలో జాతీయ భద్రతా సహాయకురాలిగా, బైడెన్హయాంలో డిప్యూటీ అటార్నీ జనరల్‌గా పనిచేశారు. ఈ మధ్యే మైక్రోసాఫ్ట్‌లో గ్లోబల్అఫైర్స్ప్రెసిడెంట్గా చేరారు. అమెరికాలో జరిగిన పలు అల్లర్ల వెనుక లిసా మొనాకో పాత్ర ఉందని ట్రంప్మొదటి నుంచీ అనుమానిస్తున్నారు.
అందులో భాగంగానే ఆమెను తొలగించాలంటూ తాజాగా డిమాండ్‌చేశారు. కాగా, ట్రంప్తీరు కక్షసాధింపు చర్యలని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఒబామా, బైడెన్దగ్గర పనిచేసిన పలువురు సీనియర్అధికారులను ఇప్పటికే ట్రంప్ తొలగించారు. ఇదే క్రమంలో లిసాను కూడా మైక్రోసాఫ్ట్‌నుంచి వెళ్లగొట్టాలని చూస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.