Trump Tariffs: ఇండియాపై 25 శాతం పన్ను.. తేల్చి చెప్పేసిన ట్రంప్..

Trump Tariffs: ఇండియాపై 25 శాతం పన్ను.. తేల్చి చెప్పేసిన ట్రంప్..

US Tariffs on India: చాలా రోజులుగా అమెరికా ఇండియా మధ్య వ్యాపార ఒప్పందం కోసం ద్వైపాక్షిక సంప్రదింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం భారత్ నుంచి ప్రత్యేక బృందం అమెరికా కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. అగ్రి, డెయిరీ ఉత్పత్తుల దిగుమతులకు ఇండియా ససేమిరా అనటంతో డీల్ లేట్ అవుతూ వస్తోంది. 

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విలేకరి అడిగిన ఒక ప్రశ్నకు బదులిస్తూ భారత్ తన మిత్రదేశమని.. ప్రధాని మోదీ తన స్నేహితుడని చెప్పారు. ఇప్పటి వరకు ట్రేడ్ డీల్ జరగలేదని బదులిచ్చిన ట్రంప్.. అన్ని దేశాలకంటే ఎక్కువ సుంకాలను భారత్ విధిస్తోందని చెప్పారు. అనేక సంవత్సరాలుగా ఇదే కొనసాగుతోందని.. ఇకపై ఇలా చేయటం న్యాయం కాదన్నారు ట్రంప్. అయితే ఆగస్టు 1న గడువు నాటికి డీల్ పూర్తి కాకుంటే ఇండియాపై కూడా 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్స్ విధించనున్నట్లు స్పష్టం చేశారు. 

ALSO READ | యూఎస్, ఈయూ మధ్య ట్రేడ్ డీల్

అయితే రెండు దేశాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఫైనల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు మధ్య నాటికి అమెరికా ప్రతినిధులు ఇండియా రావొచ్చని తెలుస్తోంది. జూలైలో రెండు దేశాల మధ్య 5వ రౌండ్ వాణిజ్య చర్చలు ముగిసినప్పటికీ డీల్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే అమెరికా యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి కొన్ని దేశాలతో తన వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకోగా.. అతిపెద్ద భాగస్వామి ఇండియా అదే పనిలో నిమగ్నమై ఉంది.