మోడీ మా మిత్రుడే.. భారత్-అమెరికా సంబంధాలపై టెన్షన్ వద్దన్న ట్రంప్..

మోడీ మా మిత్రుడే.. భారత్-అమెరికా సంబంధాలపై టెన్షన్ వద్దన్న ట్రంప్..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ నష్ట నివారణ చర్యలు స్టార్ట్ చేశారు. ఇటీవల చైనాకు భారత్, రష్యాలు దగ్గరవటంపై మిత్రులతో సంబంధాలు కోల్పోయామన్న ట్రంప్.. తాజాగా భారతదేశంతో సంబంధాలపై చేసిన కామెంట్స్ ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. అమెరికా-ఇండియా మధ్య ప్రత్యేక సంబంధం ఉందని వీటిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రధాని మోడీతో తనకు స్నేహం ఉందంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. 

భారతదేశాన్ని తాము కోల్పోయామంటూ ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయటం వల్లనే తాము అత్యధికంగా 50 శాతం సుంకాలను విధించాల్సి వచ్చిందని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ మంచి ప్రధాని అని, అతనితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు ట్రంప్. అయితే ప్రస్తుతం మోడీ చేస్తున్న చర్యలు తనకు అస్సలు నచ్చటం లేదని, అయినప్పటికీ భారత్ అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ బదులిచ్చారు. 

దీని తర్వాత కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలుపై అస్సలు వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. భారత్ తన ఎనర్జీ అవసరాల కోసం ఎక్కడి నుంచైనా క్రూడ్ కొనుక్కునే స్వేచ్ఛ కలిగి ఉందని, రష్యా నుంచి క్రూడ్ కొనుగోళ్లు ఆంక్షలకు లోబడే జరుగుతున్నాయని కూడా చెప్పారు. దీని వల్ల భారత్ భారీగా విదేశీ మారక నిల్వలను కాపాడుకోగలుగుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. దీనిపై కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మాట్లాడుతూ ఈ పరిస్థితులు కేవలం తాత్కాలికమైనవేనని అన్నారు. 

రష్యా చమురు కొనుగోలు నిలిపివేత నుంచి, బ్రిక్స్ నుంచి సభ్యత్వం వదులుకోవటం వరకు భారత్ నుండి అమెరికా డిమాండ్ల లిస్ట్ అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ బహిరంగంగా విడుదల చేసిన తర్వాత తాజా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ట్రంప్ క్షమాపణ చెప్పిన తర్వాత రెండు నెలల్లో భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన ప్రకటించారు.