భారత్ నిర్ణయాలను ట్రంప్ ప్రకటించొద్దు.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫైర్

భారత్ నిర్ణయాలను ట్రంప్ ప్రకటించొద్దు.. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఫైర్

న్యూఢిల్లీ: రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులను ఈ ఏడాది చివరిలోగా గణనీయంగా తగ్గిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ చెప్పడం సరికాదని, భారత నిర్ణయాలను అమెరికా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేశారు. 

అమెరికా తరఫున భారత్ మాట్లాడడం లేదు కాబట్టి.. భారత్ నిర్ణయాలను ప్రపంచానికి ట్రంప్ ప్రకటించరాదన్నారు. ‘‘భారత్ నిర్ణయాల గురించి ట్రంప్ ప్రకటనలు చేయడం సముచితం కాదు. భారతదేశమే దాని నిర్ణయాల గురించి ప్రకటనలు చేస్తుంది. ట్రంప్ ఏమి చేస్తారో మేం ప్రపంచానికి చెప్పం. అలాగే భారతదేశం ఏమి చేస్తుందో ట్రంప్ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు” అని థరూర్​ ఘాటుగా స్పందించారు.