వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ బిలియనీర్, టెస్లా కార్ల అధినేత ఎలన్ మస్క్ మంచి ఫ్రెండ్స్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు పూర్తి మద్దతు తెలిపాడు మస్క్. కేవలం సపోర్ట్ చేయడమే కాకుండా ట్రంప్ గెలుపు కోసం స్వయంగా ప్రచారం కూడా చేశాడు మస్క్. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచి రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అధికారంలోకి వచ్చాక తన గెలుపు కోసం కృషి చేసిన ఎలన్ మస్క్‌కు తన ప్రభుత్వంలో పదవి కూడా ఇచ్చాడు ట్రంప్. కానీ కొన్ని నెలల్లోనే ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య మనస్పర్ధాలు వచ్చాయి.
ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో విభేదించాడు మస్క్. దీంతో మిత్రులు కాస్తా శత్రువులు అయ్యారు. కలిసి మెలిసి తిరిగిన ఇద్దరూ పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఒకానొక టైములో అమెరికాలో ఉంటవా.. లేక దక్షిణాఫ్రికా పోతావా అని మస్క్‌ను హెచ్చరించాడు ట్రంప్. ఆ తర్వాత ఎలన్ మస్క్ కాస్తా సైలెంట్ అయ్యాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధాలు తొలగిపోయినట్లు ప్రచారం జరిగింది. కానీ ట్రంప్, మస్క్ మధ్య ఇంకా విభేదాలు అలాగే ఉన్నాయి. అమెరికాలోని టాప్ టెక్ కంపెనీ సీఈవోలు, అగ్రశేణి వ్యాపారులతో జరగనున్న ట్రంప్ భేటీనే ఇందుకు నిదర్శనం.
ALSO READ : "నువ్వు కొత్త ఉద్యోగం చూసుకో": జర్నలిస్ట్‌పై మండిపడిన డొనాల్డ్ ట్రంప్..
గురువారం (సెప్టెంబర్ 4) రాత్రి వైట్ హౌస్‌లో అగ్రశ్రేణి వ్యాపారులు, ప్రముఖ టెక్ కంపెనీల సీఈవోలకు డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు ట్రంప్. ఈ పార్టీకి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులను ఆహ్వానించాడు ట్రంప్. కానీ ఈ డిన్నర్ పార్టీకి గతంలో తన మిత్రుడైన ఎలన్ మస్క్‌ను మాత్రం ఇన్వైట్ చేయలేదు ట్రంప్. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తన దోస్త్‌ను ఈ డిన్నర్ పార్టీకి పిలవకుండా షాకిచ్చాడు ట్రంప్.
వైట్ హౌస్‌లోని రోజ్ గార్డెన్ క్లబ్లో ఈ డిన్నర్ పార్టీ జరగుతుందని వైట్ హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్ తెలిపారు. ఈ విందుకు అగ్రశ్రేణి వ్యాపార, రాజకీయ, సాంకేతిక నాయకులను స్వాగతించడానికి ట్రంప్ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వైట్ హౌస్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశం తరువాత జరుగుతుంది.
ట్రంప్ డిన్నర్ పార్టీ అతిథుల జాబితా:
- గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్
- గూగుల్ CEO సుందర్ పిచాయ్
- మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల
- ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్
- ఓపెన్ఏఐ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్
- ఒరాకిల్ సీఈఓ సఫ్రా కాట్జ్
- బ్లూ ఆరిజిన్ సీఈఓ డేవిడ్ లింప్
- మైక్రాన్ సీఈఓ సంజయ్ మెహ్రోత్రా
- TIBCO సాఫ్ట్‌వేర్ చైర్మన్ వివేక్ రణదివే
- పలంటిర్ ఎగ్జిక్యూటివ్ శ్యామ్ శంకర్
- స్కేల్ AI వ్యవస్థాపకుడు, CEO అలెగ్జాండర్ వాంగ్
- షిఫ్ట్4 పేమెంట్స్ సీఈఓ జారెడ్ ఐజాక్‌మన్
