
Peter Navarro: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ కౌన్సిలర్ పీటర్ నవారో సంచలన ఆరోపణలు చేశారు. భారత ప్రధాని మోడీ రష్యా యుద్ధం చేసేందుకు క్రూడ్ కొనుగోళ్ల ద్వారా ఉక్రెయిన్ పై దాడికి సహకరిస్తున్నారంటూ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. భారత్ వ్యూహాత్మకంగా తన చిరకాల మిత్రుడు రష్యాతో పాటు తాజాగా చైనాతో చేతులు కలుపుతూ ముందుకు సాగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని దానిని మిత్రుడిగా భావించటం సరికాదన్నారు.
గొప్ప నాయకుడైన మోడీ, అతిపెద్ద డెమెుక్రసీ అయిన భారత్ మెచూరిటీతో ఆలోచించాలని రష్యా నుంచి క్రూడ్ కొనుగోళ్లను మానుకోవాలని సూచించారు. వాణిజ్యం, ఎనర్జీ విషయంలో భారత్ డబుల్ గేమ్ ఆడుతోందని అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు ఆపేందుకు భారత్ అంగీకరించటం లేదని.. దీని వల్ల రోజూ 15 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి కొంటుండగా ఆ మెుత్తం రష్యా ఉక్రెయిన్ పై యుద్ధానికి వినియోగిస్తోందన్నారు. ఈ డబ్బుతో రష్యా మిసైళ్లు, డ్రోన్లకు వినియోగిస్తూ ఉక్రేనియన్ల ప్రాణాలను యుద్ధంలో తీస్తోందని.. ఇది ఖచ్చితంగా మోడీ వార్ అంటూ కామెంట్ చేశారు.
భారత్ చమురు కొనుగోళ్లతో రష్యాకు ఆర్థికంగా యుద్ధానికి తోడ్పాటును అందించటం వల్ల ఉక్రెయిన్ సహాయం కోసం అమెరికా, యూరోపియన్ దేశాల వద్దకు వస్తోంది దీని వల్ల పరోక్షంగా అమెరికా ప్రజలపై భారం పడుతోందని నవారో అన్నారు. దీంతో అమెరికన్లు కూడా మోడీ యుద్ధానికి డబ్బు వెచ్చించాల్సి వస్తోందంటూ కామెంట్ చేశారు. రష్యా నుంచి డిస్కౌంట్ రేటుకు చమురు కొని దానిని భారత రిఫైనరీలు ప్రపంచానికి అధిక రేట్లకు అమ్ముకుంటున్నాయని ఈ లాభాల ఆర్జన సైరనది కాదన్నారు.
Also Read : కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించా
భారతదేశంపై సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రాగా.. 25 శాతం టారిఫ్స్ తమను వాణిజ్యంలో మోసం చేస్తున్నందుకు వేశామని మిగతా 25 శాతం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు వేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మెుత్తానికి అమెరికా టారిఫ్స్ భారతీయ ఎగుమతుల్లో 66 శాతం వస్తువులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు వెల్లడైంది. దీని కారణంగా ఉపాధి నష్టాలు, వ్యాపార నష్టాలను చిన్న ఎగుమతిదారులు చూడాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇదే క్రమంలో మాజీ యూఎస్ అంబాసిడర్ నిక్కీ హేలీ భారతదేశంతో భాగస్వామ్యాన్ని మెరుగుపరుచుకోవాలని ట్రంప్ కి సూచించారు.
ఇదంతా పక్కనపెడితే రష్యా నుంచి అందరికంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న చైనాపై మాత్రం యూఎస్ నోరు మెదపటం లేదు. భారత్ కంటే ఎక్కువ దిగుమతులు చేసుకుంటున్న ఆ దేశంపై ఎలాంటి ఆంక్షలు ఇప్పటి వరకు ప్రకటించలేదు.