NRI News: ఇండియాకు డబ్బులు పంపే NRIలకు షాక్ : కొత్త పన్ను వేసిన ట్రంప్

NRI News: ఇండియాకు డబ్బులు పంపే NRIలకు షాక్ : కొత్త పన్ను వేసిన ట్రంప్

Trump Tax Bill: చాలా కాలం నుంచి అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆందోళనలో ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి గ్రీన్ కార్డు హోల్డర్లకు సైతం రక్షణ లేకుండా పోవటం, ఇమ్మిగ్రేషన్ రూల్స్ కఠినతరంగా మార్చటంతో పాటు విద్యార్థులను సైతం ట్రంప్ సర్కార్ వదలకపోవటం నిద్రలేకుండా చేస్తోంది. ఇదే క్రమంలో ట్రంప్ అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకు షాక్ ఇచ్చేందుకు కొత్త పన్ను చట్టానికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడైంది. 

వివరాల్లోకి వెళితే.. రిపబ్లిక్ పార్టీ కొత్తగా తీసుకురావాలని చూస్తున్న పన్ను చట్టం అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మే 12న ప్రవేశపెట్టిన బిల్లులో యూఎస్ నుంచి ఇతరదేశాలకు అమెరికా పౌరసత్వం లేని వ్యక్తులు చేసే మనీ ట్రాన్సాక్షన్లపై 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించబడింది. దీంతో అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసాలు, స్టూడెంట్ వీసాలపై నివసిస్తున్న లక్షల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారు. భారతదేశంలోని తమ తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు యూఎస్ నుంచి డబ్బు పంపేవారు ట్రంప్ కొత్త పన్నుతో అయోమయంలో ఉన్నారు.

ALSO READ | Trade War : సున్నా సుంకాలపై రగడ.. ట్రంప్ ప్రకటనను ఖండించిన ఇండియా

ఇదే క్రమంలో అమెరికా తీసుకొస్తున్న కొత్త పన్ను విధానంలో స్టాండర్ట్ డిడక్షన్, పిల్లల పన్ను క్రెడిట్ 2028 వరకు 2వేల 500 డాలర్లకు పెంచినట్లు వెల్లడైంది. ఇప్పటి వరకు అమెరికా ఇమ్మిగ్రెంట్లు తమ స్వదేశాలకు డబ్బు పంపటంపై ఎలాంటి పన్నులను విధించలేదు. కానీ ట్రంప్ ప్రస్తుతం విధిస్తున్న పన్ను అమెరికాకు బిలియన్ డాలర్ల మేర సంపదను తెచ్చిపెడుతుందని వీటిని బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు వినియోగించాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడైంది. 

ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి ఏటా ప్రవాస భారతీయులు అమెరికాలో సంపాదించిన దాని నుంచి తమ ప్రియమైన వారికి, ఫ్యామిలీకి అక్షరాలా రూ.7 లక్షల కోట్ల వరకు పంపిస్తూ ఉంటారు. ట్రంప్ చర్యల కారణంగా ఇకపై ఇండియాకు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల నుంచే వచ్చే డబ్బు తగ్గిపోతుందని అంచనా వేయబడింది. అమెరికా నుంచి పంపే ప్రతి రూ.లక్షలో రూ.5వేలు పన్ను రూపంలో కట్ అవనుంది. ఇది సొంత దేశాలకు డబ్బు పంపే ధోరణిని దెబ్బతీస్తుందని తెలుస్తోంది.