
అయోధ్యలో అసత్యంపై సత్యం గెలిచిందన్నారు ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్. లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమన్నారు.బీజేపీ నాలుగు వందల సీట్లు ఫెయిల్ అయ్యాయి. ఎన్డీఏ నడిచే సర్కార్ కాదు పడిపోయే సర్కార్ అని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో అఖిలేష్ ప్రసంగించారు. మోదీ చేసిన వాగ్దానాలను మర్చిపోతారని.. గంగానదిని శుభ్రం చేయనందుకే యూపీ ప్రజలు తగిన బుద్ధి బీజేపీకి చెప్పారన్నారు.
యూపీలోని నగరాలన్నీ వర్షాలకు చెరువులయ్యాయని చెప్పారు. రామమందిరంపై రాజకీయాలు చేసి బీజేపీ ఓడిపోయిందని తెలిపారు. దేశంలో పంటలకు మద్దతు ధర దక్కడం లేదని రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వదల్చుకోలేదని అందుకే పేపర్ లీకులు చేస్తూ కాలం గడుపుతున్నారని చెప్పారు. యూపీలోని 80 సీట్ల ఈవీఎంలపై తనకు నమ్మకం లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు.