తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ..  సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.  10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు . టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 4   కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా   నిన్న తిరుమల శ్రీవారిని 75,449 మంది భక్తులు దర్శించుకున్నారు .  27,121 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు . హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చినట్లుగా టీటీడీ వెల్లడించింది.