Beauty Tip : చర్మాన్ని మెరిపించే బంతి, పొద్దుతిరుగుడు నేచురల్ ప్యాక్స్

Beauty Tip : చర్మాన్ని మెరిపించే బంతి, పొద్దుతిరుగుడు నేచురల్ ప్యాక్స్

కొందరి స్కిన్ టోన్ కి ఫ్రూట్, క్రీమ్ ఫేస్ ప్యాక్ లు పడవు. అలాంటి వాళ్లకోసమే ఈ బంతి, పొద్దుతిరుగుడు నేచురల్ ప్యాక్స్ . ఇవి స్కిన్ టాన్ సమస్య నుంచి బయటపడేస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఈ ప్యాక్ లు ఎలా తయారుచేసుకోవాలంటే.. 

• బంతిపూలను మెత్తగా నూరాలి. ఆ గుజ్జులో పచ్చిపాలు కలిపి 12 గంటలు నానబెట్టాలి. మరుసటి రోజు అందులో నాలుగైదు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి.కాసేపయ్యాక చన్నీళ్లతో కడగాలి. బంతిపూలలో ఉన్న యాంటిఇన్ ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ గుణాలు చర్మంపై మచ్చల్ని పోగడతాయి. స్కిన్ టానింగ్ ని తగ్గిస్తాయి. 

• పొద్దుతిరుగుడు పువ్వును మెత్తగా నూరి అందులో టొమాటో గుజ్జు, పచ్చిపాలు కలిపి పేస్ట్ గా చేయాలి. ఆ పేస్ట్ ని అరగంట ఫ్రిజ్ లో ఉంచాలి. ఆ తర్వాత చర్మంపై రాయాలి. పావుగంట తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి. ఇలా వారానికోసారి చేస్తే పొద్దు తిరుగుడు లోని విటమిన్-ఇ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.