ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 28 వరకు అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: శాసనసభ బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన బీఏసీ బేటీలో వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు. సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంతో పాటు ఏయే అంశాలపై సభ నడపాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 28 వరకు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈనెల 12, 13, 20, 27 తేదీల్లో శాసనసభకు సెలవులు ఇవ్వనున్నారు. మొత్తం 18రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి.