B ఫార్మసీలో 6 వేల 910 సీట్లు.. కౌన్సెలింగ్ ప్రారంభం

B ఫార్మసీలో 6 వేల 910 సీట్లు.. కౌన్సెలింగ్ ప్రారంభం

తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2023 ద్వారా B ఫార్మసీ సీట్లకు  ఫస్ట్ ఫేజ్  కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి( సెప్టెంబర్ 2 ) ప్రారంభమయ్యింది.  ఫస్ట్ ఫేజ్  కౌన్సెలింగ్ కోసం 114 ఫార్మసీ కాలేజీల్లోని 6910 బి ఫార్మసీ సీట్లు ఉన్నాయి. 

61 కాలేజీల్లో 1191 ఫార్మ్ డీ సీట్లు, మూడు కాలేజీల్లో 94 బయోటెక్నాలజీ సీట్లు, రెండు కాలేజీల్లో బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో 36 సీట్లు, ఇతర కోర్సుల్లో రెండు ప్రైవేట్ కాలేజీల్లో ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌లో 81 సీట్లు ఉన్నాయి.

సెప్టెంబరు 4, 5 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్, సెప్టెంబర్ 4 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లతో  ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది.