
- తొలిరోజు 69,658 మంది అటెండ్
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం రెండు సెషన్లలో 74,205 మందికిగాను 69,658 మంది హాజరయ్యారని ఎప్‌సెట్ కన్వీనర్ దీన్ కుమార్, కో కన్వీనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. వివిధ కారణాలతో 4,547 మంది అటెండ్ కాలేదు. ఫస్ట్ సెషన్‌లో 37,041 మందికిగాను 34,618 మంది హాజరుకాగా, సెకండ్ సెషన్‌లో 37,164 మందికిగాను 35,040 మంది హాజరయ్యారు.
కాగా, పరీక్షా కేంద్రాలను టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, జేఎన్టీయూ వీసీ కిషన్ కుమార్ రెడ్డి, రెక్టర్ విజయకుమార్, కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేశ్ తదితరులు సందర్శించారు. శనివారం, ఆదివారం కూడా ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి.