
హైదరాబాద్, వెలుగు: టీఎస్ ఈసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 13,083 సీట్లకు 10,573 మందికి సీట్లు కేటాయించామని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ తెలిపారు. ఇంకో 2,510 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. కాగా, ఇంజినీరింగ్ లో 170 కాలేజీల్లో 10,496 (88.53 శాతం) సీట్లు నిండగా, ఫార్మసీలో 117 కాలేజీల్లో 7 (6.27%) సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈనెల 29లోగా సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించారు.