V6 News

టీజీ జెన్‌‌‌‌ కోకు ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికేషన్... గుర్తింపు పత్రాన్ని సీఎండీకి అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

టీజీ జెన్‌‌‌‌ కోకు ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికేషన్... గుర్తింపు పత్రాన్ని సీఎండీకి అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ తెలంగాణ జెన్‌‌‌‌కో (టీజీ జెన్‌‌‌‌కో)కు నాణ్యత, సామ ర్థ్యం, నిరంతర మెరుగుదలకు అంతర్జాతీయ గుర్తిం పు లభించింది. క్వాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్ సిస్టమ్‌‌‌‌లో జెన్‌‌‌‌కో సంస్థ ప్రతిష్టాత్మకమైన ఐఎస్‌‌‌‌ఓ సర్టిఫికేషన్‌‌‌‌ను సాధించింది. స్వతంత్ర ఐఎస్‌‌‌‌ఓ ధ్రువీకరణ సంస్థ నిర్వహించిన సమగ్ర ఆడిట్ అనంతరం ఈ గౌరవం దక్కింది. ఈ తనిఖీల్లో ఆడిట్ బృందం టీజీ జెన్‌‌‌‌కోలోని అన్ని విభాగాలు, కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్తమ పద్ధతులను సంస్థ పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాత ఈ సర్టిఫికేషన్ మంజూరుకు ఆమోదం లభించింది. 

ఈ సర్టిఫికెట్‌‌‌‌ను మంగళవారం సంస్థ సీఎండీ హరీశ్​కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందజేశారు. ఈ గుర్తింపు వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే బాధ్యత పెరుగుతుందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్) సీఎండీ జితేష్ వి. పాటిల్, ఐఎస్‌‌‌‌ఓ ప్రతినిధి శివయ్య తదితరులు పాల్గొన్నారు.