హైదరాబాద్లో టన్నెల్ రోడ్లు..ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

 హైదరాబాద్లో  టన్నెల్ రోడ్లు..ఎక్కడి నుంచి ఎక్కడికంటే?

హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు టన్నెల్ రోడ్లు నిర్మాణంపై ప్రభుత్వం  దృష్టి సారించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నగరంలోని ఐదు ప్రాంతాలను ఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా  మూడు మార్గాల్లో దాదాపు 39 కి.మీ మేర సొరంగ టన్నెల్ రోడ్ల నిర్మాణానికి నివేదిక రూపొందించేందుకు నిర్ణయించారు. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు టెండర్లు పిలిచారు. 

Also Read : ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో భారీభద్రత

  • ఐటీసీ కోహినూర్ నుంచి విప్రో సర్కిల్ వరకు వయా ఖాజాగూడ, నానక్ రాంగూడ వరకు- 9కి.మీ
  • ఐటీసీ కోహినూర్ నుంచి జేఎన్టీయూ వరకు వయా మైండ్ స్పేస్ జంక్షన్ 8కి.మీ
  •  ఐటీసీ కోహినూర్  నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 వయా జూబ్లీహిల్స్ రోడ్ నంబ45 వరకు- 7కి.మీ
  • జేవీకే మాల్ నుంచి నానల్ నగర్ వయా మాసబ్ ట్యాంక్  -6.కి.మీ
  •  నాంపల్లి నుంచి చాంద్రాయణ గుట్ట ఇన్నర్రింగ్ రోడ్డు వయా చార్మినార్, ఫలక్ నుమా-9కి.మీ