తెలంగాణ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఈ నెల పూర్తి జీతం

తెలంగాణ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ఈ నెల పూర్తి జీతం

రాష్ట్ర ఉద్యోగుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు ఈ నెల పూర్తి జీతాలు చెల్లిస్తామ‌ని తెలిపింది. కరోనా నేపథ్యంలో గత మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లలకు 50 శాతం వేతనాలు మాత్రమే చెల్లిస్తోంది. అయితే ఈ విషయంపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం, ధర్మాసనం కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జూన్ నెల పూర్తి వేత‌నం చెల్లించాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేరకు ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.