చిరంజీవి, వెంకయ్య నాయుడిని సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం

చిరంజీవి, వెంకయ్య నాయుడిని సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. పద్మ అవార్డు గ్రహీతలను సత్కరించింది. ఫిబ్రవరి 4వ తేదీ ఆదివారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరయ్యారు.

మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడుతో సహా ఆరుగురు పద్మ అవార్డు గ్రహీతలను శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల క్యాష్ రివార్డ్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం వేదికపై .. చిరంజీవి, వెంకయ్య నాయుడులు ఒకరినొకరు సన్మానించుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిందు యక్షగానం, బుర్రకథలను తెలంగాణ కళకారులు ప్రదర్శించారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎనిమిది మందికి పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకయ్యనాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్..  చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, స్థపతి వేళు ఆనందాచారి, బుర్రవీణ కథకుడు దాసరి కొండప్ప, కవి కూరెళ్ల విఠలాచార్య, సంగీత కళాకారుడు కేతావత్  సోమాలాల్, సంగీత నాటక కళాకారిణి ఉమామహేశ్వరిలకు పద్మశ్రీ పురస్కారాలను దక్కాయి.