16 ,940 పోస్టులకు వచ్చే నెలలో నోటిఫికేషన్లు : సీఎస్

16 ,940 పోస్టులకు వచ్చే నెలలో నోటిఫికేషన్లు : సీఎస్
  • సీఎస్​ సోమేశ్​​ కుమార్​ వెల్లడి
  • రిక్రూట్​మెంట్​పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వివిధ శాఖల్లోని 16,940 పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎస్​ సోమేశ్‌‌కుమార్‌‌ వెల్లడించారు. పలు శాఖల్లో పోస్టుల భర్తీపై మంగళవారం బీఆర్కే భవన్‌‌లో టీఎస్​పీఎస్సీ చైర్మన్​ జనార్దన్​ రెడ్డితో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా సీఎస్​ మాట్లాడుతూ.. వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉద్యోగ నియామకాలు టీఎస్​పీఎస్సీ , పోలీస్ రిక్రూట్‌‌మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ రిక్రూట్ మెంట్ బోర్డు తదితర ఏజెన్సీల ద్వారా జరుగుతున్నాయన్నారు. నియామకాల ప్రక్రియలో సమయపాలన పాటించడంతోపాటు, రిక్రూట్‌‌మెంట్‌‌ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సర్వీస్ రూల్స్‌‌లో మార్పులు పూర్తి చేసి వివరాలను టీఎస్ పీఎస్సీకి పంపాలని, వాటి ఆధారంగా కమిషన్​ వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు.