స్కూల్స్ రీ ఓపెనింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

స్కూల్స్ రీ ఓపెనింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో విద్యా సంస్థల రీ ఓపెనింగ్ పై హైకోర్టు కీలక సూచనలు చేసింది. స్కూళ్ల ప్రారంభానికి అనుమతిస్తూనే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలంటూ స్టూడెంట్స్ ను బలవంతం చేయొద్దని ఆదేశించింది హైకోర్టు. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ క్లాసులపై స్కూల్స్ నిర్ణయించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహించని స్కూల్స్ పైనా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక గురుకులాలు, రెసిడెన్సియల్ హాస్టల్స్ తెరవొద్దని తెలిపింది. దీనిపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని సర్కార్ ను ఆదేశించింది హైకోర్టు.