కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కోరిన ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ కోరిన ప్రభుత్వం

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. బ్యారేజీ కుంగడంపై  ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ కోరింది. దీనిపై సుప్రీం కోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్  జడ్జ్ తో విచారణ జరిపించాలని ప్రభుత్వం పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వయిరీకి ఆదేశించినట్టు తెలిపింది ప్రభుత్వం.  

విజిలెన్స్ రిపోర్ట్ తర్వాత ఇంజనీర్లను విధుల నుంచి తొలగించామని.. మేడిగడ్డ బ్యారేజీ కుంగడానికి కారణమైన అధికారులపై ఫైనల్ రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెప్పింది. ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. డ్యాం సేఫ్టీ అథారిటీ ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ కు హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను హై కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.