4 నెలలు కాళేశ్వరం పనులు బంద్​

4 నెలలు కాళేశ్వరం పనులు బంద్​

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ నాలుగు నెలల పాటు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్​ విచారణ చేస్తుండగా.. మరోవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, డిజైన్లపై అధ్యయనానికి నేషనల్​ డ్యామ్ ​సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ వేయా లని రాష్ట్ర ప్రభుత్వమే కోరింది. దీంతో ఆ కమిటీ చేసే సూచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలని కమిటీ చెప్పడంతో బ్యారేజీలను ఖాళీ చేశారు. ఏవైనా మరమ్మతులు చేయాలన్నా ఎక్స్​పర్ట్​కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉండటంతో అప్పటి దాకా ఎలాంటి పనులు చేపట్టబోమని ఇంజనీర్లు చెబుతున్నారు.