హైకోర్టులో ఇక లైవ్ టెలికాస్టులు

హైకోర్టులో ఇక లైవ్ టెలికాస్టులు

హైదరాబాద్, వెలుగు : హైకోర్టు మరో చారిత్రక ఘట్టానికి తెర తీయనుంది. సోమవారం నుంచి హైకోర్టు పరిధిలోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణను లైవ్  టెలికాస్ట్  చేయనున్నారు. సోమవారం ఉదయం 10.15 గంటలకు చీఫ్‌‌  జస్టిస్‌‌  అలోక్‌‌  అరాధే  లైవ్‌‌  కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పావుగంట తర్వాత 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణను లైవ్‌‌  టెలికాస్ట్  చేస్తారు. 

కాగా, కరోనా సమయంలో ఫస్ట్  కోర్టులో కేసుల విచారణ లైవ్‌‌  జరిగింది. ఆ తర్వాత హైబ్రిడ్‌‌  విధానం కొనసాగింది. ఇప్పటికీ ఫస్ట్‌‌  కోర్ట్‌‌లోని కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇక నుంచి మొత్తం 29 హైకోర్టుల్లోని కేసుల విచారణ లైవ్‌‌ ఉంటుంది.