భూమి డబుల్‌‌‌‌ రిజిస్ట్రేషన్లపై: హైకోర్టు ఆదేశం

భూమి డబుల్‌‌‌‌ రిజిస్ట్రేషన్లపై: హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తమకు అమ్మిన భూమినే ఇతరులకు కూడా అమ్ముతున్నారంటూ దాఖలైన పిటిషన్‌‌‌‌పై కౌంటర్‌‌‌‌ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను హైకోర్టు ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట్‌‌‌‌ మండలం వట్టినాగులపల్లి గ్రామంలో 460 ఎకరాలకుపైగా భూమిని దాదాపు 3,308 మంది.. 1983 నుంచి 1986 మధ్య చట్టప్రకారం కొనుగోలు చేసి సేల్‌‌‌‌డీడ్‌‌‌‌ ద్వారా ప్లాట్లు పొందామని.. కానీ,ఆ భూములను రెవెన్యూ అధికారులు పాత యజమానుల పేర్లపైనే ఉంచారని మేడ్చల్‌‌‌‌ హైదర్‌‌‌‌నగర్‌‌‌‌కు చెందిన రిటైర్డ్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌ వి.రామారావుతోపాటు మరో 19 మంది హైకోర్టును ఆశ్రయించారు.  

ఈ కేసులో సీఐడీ విచారణ జరిపి తమ భూములు తిరిగి ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్​ను విచారించిన కోర్టు కౌంటర్​దాఖలు చేయాలని ప్రతివాదులు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌‌‌‌ఏ, డీజీపీ, సైఫాబాద్‌‌‌‌ సీఐడీ, అడిషనల్‌‌‌‌ డీజీపీ, సైబరాబాద్‌‌‌‌ సీపీతో పాటు, అధికార ప్రతినిధులకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను ఏప్రిల్‌‌‌‌ 15కు వాయిదా వేశారు.