
వరంగల్ లోక్ సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా గెలిచినా ఆరూరి రమేష్ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే గతంలో తనకు కేటాయించిన గన్ మెన్లను తొలగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు రమేష్. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆరూరి రమేష్ కు వన్ ప్లస్ వన్ భద్రత కేటాయించాలని తెలంగాణ డీజీపీ, వరంగల్ పోలీస్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశించింది.