గర్భిణికి ట్రీట్ మెంట్ చేయకపోవడం నేరమే

గర్భిణికి ట్రీట్ మెంట్ చేయకపోవడం నేరమే

హైదరాబాద్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గర్భిణి (20) పురిటి నొప్పులతో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ట్రీట్ మెంట్ చేయకపోవడం కచ్చితంగా నేరమే అవుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. మొత్తం 7 ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ట్రీట్ మెంట్ చేయలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయా దవాఖాన్ల నుంచి ఆమె కుటుంబానికి పరిహారం ఇప్పిస్తే తప్పేముంటుందని ప్రభుత్వాన్ని అడిగింది. సకాలంలో  వైద్యం అందకనే తల్లీబిడ్డ మరణించారని ఫైల్ అయిన పిల్స్ చీఫ్‌ జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ విజయ్ సేన్ రెడ్డిల నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. బాధ్యులపై తీసుకున్న చర్యలపై రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం గడువు కోరగా, హైకోర్టు విచారణను వచ్చే  వారానికి వాయిదా వేసింది.