టీఎస్ ఐసెట్ షెడ్యూల్ రిలీజ్

టీఎస్ ఐసెట్ షెడ్యూల్ రిలీజ్

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు అర్హత పరీక్ష అయిన టీఎస్ ఐసెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి రిలీజ్ చేసింది. ఈ ఏడాది కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తున్న ఈ పరీక్ష రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి6 నుంచి ప్రారంభం కానుంది. మే 26, 27 తేదీల్లో టీఎస్ ఐసెట్ ఎంట్రెన్స్ నిర్వహించనున్నారు. జూన్ 20న ఫలితాలు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 550, మిగతా కేటగిరీ విద్యార్థులు రూ.750 చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 250 ఫైన్ తో మే 12, రూ. 500 ఫైన్ తో మే 18 వరకు అప్లికేషన్లు సబ్మిట్ చేసే అవకాశం కల్పించారు. మే 22 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

మే 26, 27 తేదీల్లో రెండు సెషన్లుగా ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10  నుంచి 12.30గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఐసెట్ ఎగ్జామ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 75 సెంటర్లు ఏర్పాటు చేశారు.