
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 21 నుంచి ప్రారంభమైన ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ మెయిన్ ఎగ్జామ్స్ ముగిశాయి. చివరి రోజు కెమిస్ర్టీ, కామర్స్ ఎగ్జామ్స్ జరిగాయి. మంగళవారం 31 మంది విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి.
ఫస్టియర్లో 1,58,320 మంది విద్యార్థులు అటెండ్ కావాల్సి ఉండగా, 1,43,541 మంది హాజరయ్యారు. యాదాద్రిలో 14 మంది, నిజామాబాద్ ఐదుగురు, హైదరాబాద్లో ఇద్దరిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. సెకండియర్ లో 47,972 మందికి గాను 42,686 మంది అటెండ్ అయ్యారు. సంగారెడ్డిలో 8 మంది, కరీంనగర్, జనగామ జిల్లాల్లో ఒక్కొక్కరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ నెల29 నుంచి స్పాట్ వాల్యువేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది.