
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ పరీక్ష ఫలితాల ప్రక్రియను ఇప్పటికే ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. పరీక్షా ఫలితాలపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tsbie.cgg.gov.in/ వివరాలను పొందుపరిచినట్టు అధికారులు చెప్పారు.