బీటెక్​లో 70,689 సీట్లు అలాట్

 బీటెక్​లో 70,689 సీట్లు అలాట్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​ ఎంసెట్ సెంకడ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. దీంట్లో మొత్తం70,689 మందికి సీట్లు అలాట్ చేశారు. రాష్ట్రంలో 174 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 82,702 సీట్లున్నాయి. వీటిలో బీటెక్ కాలేజీల్లో ఫస్టియర్ అడ్మిషన్ల కోసం  82,152 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్​లో పాల్గొనగా, 53,764 మంది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లలో పాల్గొన్నారు. మొత్తంగా 70,689 మందికి సీట్లు అలాట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. వీరిలో కొత్తగా 7,417 మందికి కేటాయించారు. ఇంకా 12,013 సీట్లు మిగిలాయి. 16 సర్కారు కాలేజీల్లో 5,145 సీట్లకు 4,178 మందికి,156 ప్రైవేటు కాలేజీల్లో  76,198 సీట్లకు 65,382 సీట్లు, రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,359 సీట్లకు 1,129 సీట్లు స్టూడెంట్లకు అలాట్ చేశారు. అయి తే, తక్కువ ఆప్షన్లు పెట్టుకున్న 4,701 మందికి సీట్లు కేటాయించలేదు. నాలుగు సర్కారు, 28 ప్రైవేటు కాలేజీల్లో వందశాతం సీట్లు నిండాయి. ఈనెల 2 వరకు ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టు చేయాల ని అధికారులు సూచించారు. 

కంప్యూటర్ సైన్స్​లో 94.40% అలాట్

కంప్యూటర్ సైన్స్​, దాని అనుబంధ కోర్సుల్లో 94. 40% సీట్లు నిండాయి. మొత్తం 18 బ్రాంచుల్లో 56,059 సీట్లకు 52,922 సీట్లు స్టూడెంట్లకు కేటాయించారు. కేవలం 3,137 సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. ఏడు బ్రాంచుల్లో వందశాతం సీట్లు అలాట్ అయ్యాయి. సీఎస్ఈలో 22,933 సీట్లు నిండగా, 580 సీట్లు మిగిలాయి. ఐటీలో 139 సీట్లు ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్​లో 17,320 సీట్లకు 13,515 సీట్లు అలాట్ చేశారు. ఈసీఈలో 1,616, ఈఈఈలో 2,129 సీట్లు మిగిలాయి. సివిల్, మెకానికల్ కోర్సుల్లో 8,125 సీట్లకు కేవలం 3,533(73.48%) సీట్లు మాత్రమే నిండాయి. సివిల్ ఇంజినీరింగ్​లో 2,232, మెకానికల్ ఇంజినీరింగ్​లో 2,249 సీట్లున్నాయి.