పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈనెల 16 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభిస్తామని సెట్ కన్వీనర్ అరుణ కుమారి తెలిపారు. రిజిస్ర్టేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600, మిగిలిన అభ్యర్థులకు రూ.1100 ఉంటుందని చెప్పారు. మే 10 వరకూ ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 

రూ.250 ఫైన్​తో మే 14 వరకు, రూ.వెయ్యి ఫైన్​తో మే 17 వరకూ, రూ.2500 ఫైన్​తో మే 21 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. జూన్ 6 నుంచి 9 వరకూ  పీజీఈసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఉంటాయనీ, మే 28నుంచి హాల్ టికెట్లు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు.