టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్

టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ ఫ్రీ సర్వీస్

హైదరాబాద్: పదో  తరగతి విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 23 నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఫ్రీ బస్ సర్వీసును అందించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు ప్రస్తుతం కలిగిఉన్న బస్ పాస్ వ్యాలిడిటీని జూన్ 1 వరకు పొడిగిస్తున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.పదో తరగతి విద్యార్థులు తమ బస్ పాస్ తో పాటు హాల్ టికెట్ చూపించి పరీక్ష రోజుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని  ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 

సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి సంస్థ అభివృద్ధికి వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మదర్స్ డే, చిల్డ్రన్స్ డే లాంటి ప్రత్యేక దినాల్లో ప్రత్యేక ఆఫర్లను తీసుకువచ్చి సంస్థను ప్రయాణికులకు అన్ని విధాల దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.పండుగల సంమయంలోనూ ప్రముఖ పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపి భక్తుల అభిమానాన్ని అందుకుంటున్నారు.సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ప్రయాణికుల నుంచి అందే వినతులు ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పోటీ - పవన్ కళ్యాణ్

రుణాలు ఎగ్గొట్టిన శ్రీలంక..!