మార్చి 7న పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

మార్చి 7న పదో తరగతి హాల్ టికెట్లు విడుదల

తెలంగాణలో మార్చి 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరుగుతాయి.  ఈ క్రమంలో మార్చి 7న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లను బోర్డు విడుదల చేయనుంది. ఇప్పటికే పాఠశాలలకు విద్యార్థుల ప్రింటెండ్ హాల్ టికెట్లను పంపించింది పదో తరగతి పరీక్షల బోర్డు.   అయితే వెబ్ సైట్ నుంచి కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలు కల్పించింది.

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెన్త్ పరీక్షల కోసం  2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 5,08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.  మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. 

 పదో తరగతి పరీక్షల షెడ్యూల్

మార్చి 18: ఫస్ట్ లాంగ్వేజ్(తెలుగు, కాంపోజిట్ కోర్సు)
మార్చి 19: సెకండ్ లాంగ్వేజ్( హిందీ)
మార్చి 21: థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)
మార్చి 23: మ్యాథమెటిక్స్
మార్చి 26: సైన్స్ పేపర్ -1(ఫిజిక్స్)
మార్చి 28: సైన్స్ పేపర్ -2(బయాలజీ)
మార్చి 30: సోషల్ స్టడీస్
ఏప్రిల్ 1:  ఒకేషనల్‌ కోర్సు (సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్‌)‌,
ఏప్రిల్ 2:  ఒకేషనల్ కోర్సు(సంస్కృతం, అరబిక్ రెండో పేపర్‌)