- టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి
మెదక్, వెలుగు: సీనియర్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ కేవల్ కిషన్ భవన్ లో జరిగిన జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ఉపాధ్యాయులందరూ పోరాటానికి సిద్ధం కావాలన్నారు. టీచర్లందరూ టెట్ గురించి ఆందోళన చెందుతున్నారన్నారు.
పెండింగ్ లో ఉన్న ఐదు డీఏలను వెంటనే క్లియర్ చేయాలని, 2023 జులై నుంచి పీఆర్సీ అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుల బిల్లులన్నింటిని తక్షణమే విడుదల చేయాలని, మోడల్ స్కూల్, గురుకులాలు, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షుడు పద్మారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, కోశాధికారి అజయ్ పాల్గొన్నారు.
