
హైదరాబాద్: యువత నైపుణ్యాన్ని ఒడిసి పట్టేందుకు TSIC కృషి చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రీసెర్ట్ అండ్ డెవలప్ మెంట్ కు హైదరాబాద్ హబ్ గా మారింద న్నారు కేటీఆర్. ప్రముఖ కంపెనీలకు తెలంగాణ ఫేవరేట్ రాష్ట్రంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. అమరరాజా గ్రూప్ నిర్వహించిన ఈవోల్వ్ -అడ్వాన్స్‌డ్ బ్యాటరీ టెక్నాలజీస్‌పై ప్రత్యేక సదస్సులో మాట్లాడుతున్న పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అమర్ రాజా కంపెనీ పెట్టుబడులను స్వాగతిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు.
పరిశోధన, డిజైన్, ఇంజనీరింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందంజలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న గిగా కారిడార్ లో అమర్ రాజా బ్యాటరీస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మొబిలిటీ రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం జహీరాబాద్ ను ఎంపిక చేశామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.