14 నుంచి పోలీస్‌‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

14 నుంచి పోలీస్‌‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: ఫైనల్ ఎగ్జామ్స్‌‌లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్‌‌ అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్‌‌కు టీఎస్‌‌ఎల్‌‌పీఆర్‌‌‌‌బీ ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈ నెల 14 నుంచి 26 వరకు వెరిఫికేషన్ నిర్వహిస్తామని బోర్డు చైర్మన్‌‌ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 11 వర్కింగ్ డేస్​లో రాష్ట్రవ్యాప్తంగా 18 సెంటర్లలో సర్టిఫికెట్‌‌ వెరిఫికేషన్‌‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు అభ్యర్థులకు ఇచ్చే ఇంటిమేషన్‌‌ లెటర్స్​లో  ఉంటాయని చెప్పారు. ఈ నెల 11న ఉదయం 8 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 8 గంటల వరకు ‘www.tslprb.in’ వెబ్‌‌సైట్‌‌లో ఇంటిమేషన్‌‌ లెటర్లను డౌన్‌‌లోడ్‌‌ చేసుకోవచ్చని సూచించారు. ఎడిట్‌‌ ఆప్షన్‌‌ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు..సర్టిఫికెట్‌‌ వెరిఫికేషన్‌‌ అభ్యర్థులు వారికి సూచించిన తేదీల్లో 9 గంటల వరకు సెంటర్‌‌కు చేరుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇంటిమేషన్‌‌ లెటర్‌‌తో పాటు ధ్రువపత్రాల ఒరిజినల్స్‌‌ తీసుకురావాలని అభ్యర్థులకు శ్రీనివాస్ రావు సూచించారు.

ఎడిట్‌‌ ఆప్షన్‌‌ కోసం దరఖాస్తు చేసి ఉంటే అందుకు సంబంధించిన ట్రాన్సాక్షన్‌‌ ఫామ్‌‌, పార్ట్‌‌-2 అప్లికేషన్‌‌ ప్రింట్‌‌అవుట్‌‌, ఆధార్‌‌ కార్డు, వయస్సు ధ్రువీకరణకు ఎస్‌‌ఎస్‌‌సీ మెమో ఒరిజినల్‌‌తో పాటు పైన పేర్కొన్న అన్ని ధ్రువపత్రాల జిరాక్స్‌‌ కాపీలు,సెల్ఫ్‌‌ అటెస్టెడ్‌‌ చేసినవి తీసుకురావాలని  తెలిపారు. స్థానికత నిర్ధారణ కోసం ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన స్టడీ లేదా బోనఫైడ్‌‌ సర్టిఫికెట్స్‌‌ అందించాలన్నారు. ఆదిలాబాద్‌‌, సైబరాబాద్‌‌, హైదరాబాద్‌‌, కరీంనగర్‌‌, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌‌,మహబూబ్‌‌నగర్‌‌, నాగర్‌‌కర్నూల్‌‌, గద్వాల్‌‌, నల్గొండ, నిజామాబాద్‌‌, రాచకొండ, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్​లో సర్టి ఫికెట్‌‌ వెరిఫికేషన్‌‌ నిర్వహించనున్నట్లు శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.