టీఎస్‌‌‌‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి : గౌని రాజ రమేశ్ యాదవ్

టీఎస్‌‌‌‌పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి : గౌని రాజ రమేశ్ యాదవ్

నల్గొండ అర్బన్, వెలుగు: టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని యూత్‌‌‌‌ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజ రమేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ పట్టణంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని మండిపడ్డారు.

తెలంగాణ వచ్చాక ఒక్క గ్రూప్‌‌‌‌ 1 ఎగ్జామ్‌‌‌‌ కూడా సరిగ్గా నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. పేపర్ల లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను ఆగం చేసి టీఎస్‌‌‌‌పీఎస్సీ బోర్డును రద్దు చేసి సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. యూత్‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌ జాతీయ కార్యదర్శి ఖాలీద్ అహ్మద్, కో ఆర్డినేటర్ రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్ నాయక్, నేతలు పాల్గొన్నారు.